Wednesday, April 9, 2025
Homeక్రైమ్భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ
తెగి పడిన వాహనదారుడి చెయ్యి
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపురం క్రాస్ వద్ద గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలం సోమన్ పల్లి గ్రామానికి చెందిన కడారి శ్రవణ్ అనే యువకుడు గణపురం మండలంలో వివాహ వేడుకలో పాల్గొని తన స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో కమలాపూర్ క్రాస్ వద్ద లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రవణ్ కుడి చేయి పూర్తిగా తెగి పడిపోయింది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రమాదాన్ని గమనించిన కొందరు వ్యక్తులు 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది శ్రవణ్ ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments