ఘోర రోడ్డు ప్రమాదం
ఐదుగురి మృతి..!
వరంగల్-ఖమ్మం మెయిన్ రోడ్డుపై ఘటన
ట్ వాయిస్, క్రైమ్ : వరంగల్ -ఖమ్మం ప్రధాన రహదారి మామూనూరు వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ మెయిన్ రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మహిళలతో పాటు ఓ బాలుడు మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ప్రమాద ఘటనకు వెళ్లి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు డ్రైవర్ మత్తులో ఉండడమే కారణమని, ప్రస్తుతం అతడు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments