మంత్రి ఉత్తమ్‌కు తప్పిన ప్రమాదo
కాన్వాయ్‌లో ఢీకొన్న కార్లు..
స్పాట్ వాయిస్ , బ్యూరో: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్‌లోని ఎనిమిది కార్ల ముందు భాగాలు, బానెట్లు ధ్వంసమయ్యాయి. శుక్రవారం ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది కార్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. మంత్రి క్షేమంగా బయటపడటంతో ప్రమాదం తప్పడం అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Recent Comments