ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం
డ్రైవర్ మృతి..నలుగురికి తీవ్రగాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం…
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి డీసీఎం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ మృతి చెందగా, అందులో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే డీసీఎం డ్రైవర్ కు నిద్రమత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎస్సై మంగ, సీఐ సదన్ కుమార్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వాహనంలోనుంచి బయటకు తీసి 108 ద్వారా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments