స్పాట్ వాయిస్ , గణపురం: ఓవర్టేక్ చేయబోయి రెండు లారీలు బలంగా ఢీకొని ముందు భాగం నుజ్జయి డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ కేటీపీపీ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. భూపాలపళ్లి నుంచి పరకాల వైపు వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి వెనకనుంచి బలంగా ఢీకొట్టింది దీంతో వెంకటాపూర్ మండలం పట్వారిపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికులు అతనిని బయటకు తీసి వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. కాగా ప్రమాద ఘటనతో 353 జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్సై అభినవ్ ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments