16 నుంచి టపాకుల దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ..
20 నుంచి 27 వరకు టపాకులు అమ్ముకోవచ్చు..
డీసీపీ వైభవ్ గైక్వాడ్
స్పాట్ వాయిస్, క్రైమ్: దీపావళి టపాకాయల రిటేల్ వ్యాపారం నిర్వహించాలనుకునే వారు దుకాణాల ఏర్పాటు కావాల్సిన అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ పరిపాలన విభాగం అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల అనుసరించి జోన్లవారీగా గుర్తించిన ప్రదేశాల్లో దీపావళి టపాకుల రిటేల్ వ్యాపారానికి సంబంధించి దరఖాస్తులను ఈ నెల 16వ తేదీ నుంచి స్వీకరిస్తామని, 20వ తేదీన దరఖాస్తుల గడువు ముగియడంతో పాటు, అదే రోజు పరిశీలించిన అనంతరం అర్హత కలిగిన దరఖాస్తులకు అనుమతి మంజూరు ఉంటుందన్నారు. దీపావళి టపాకుల రిటేల్ వ్యాపారం ఈ నెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వరకు నిర్వహించుకోవాల్సి ఉంటుందని, ఆసక్తి గల వ్యాపారులు దరఖాస్తుతో పాటు డివిజినల్ అగ్నిమాపకాధికారి అనుమతి పత్రం, ప్రభుత్వ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోనేవారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి పత్రాలు. అలాగే ప్రైవేట్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోనేవారు స్థల యజమాని అనుమతి పత్రం, గత సంవత్సరం అనుమతి పొందిన పత్రం, దుకాణం ఏర్పాటు చేసుకోనే ప్రదేశంలోని ఇరుగు పొరుగు వ్యక్తుల అనుమతి, దుకాణం ఏర్పాటు చేసుకోనే ప్రదేశం ప్లాన్, నక్కల గుట్ట ఎస్బీఐలో ప్రభుత్వ ఖాజానాకు రూ.800 చెల్లించిన ఒరిజినల్ రశీదును దరఖాస్తు పాటు అందించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను దుకాణాదారులు టపాకుల వ్యాపారం నిర్వహించుకునే ప్రదేశాన్ని అనుసరించి సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయాల్లో అందించాలని ఈ సందర్భంగా అదనపు డీసీపీ తెలిపారు.
Recent Comments