Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఏసీబీకి చిక్కిన కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన కార్యదర్శి

రూ.4,500 తీసుకుంటూ పట్టుబడిన వైనం
జనగామ జిల్లాలో కలకలం
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రఘునాథపల్లి పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ. 4.500 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రఘునాథపల్లి గ్రామ పంచాయతీకి చెందిన పేర్ని మల్లేష్ ఇంటి అనుమతి కోసం రఘునాథపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి సంతోష్ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం.. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో గ్రామపంచాయతీలో కార్యదర్శి రూ.4500 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments