ధరణి ఆపరేటర్ సైతం..
రూ.4వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
స్పాట్ వాయిస్, కమలాపూర్: హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మండలంలోని కన్నూరు గ్రామానికి చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం 30, 000 డిమాండ్ చేయగా.. కంప్యూటర్ ఆపరేటర్ కు రూ.5,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు సమాచారం. తహసీల్దార్ మాధవి రూ.4వేలు, ధరణి ఆపరేటర్ రూ.1000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేపడితే అనేక ఆసక్తికర అంశాలు బయట పడే అవకాశం ఉన్నట్లు మండల ప్రజలు చెబుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి చేపను ఏసీబీ అధికారులు పట్టుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అతడితో పాటు మరో మూడు అవినీతి చేపలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దాడుల పూర్తి వివరాలు మరికాసేపట్లో ఏసీబీ అధికారులు వెల్లడించనున్నారు.
ఏసీబీకి చిక్కిన కమలాపూర్ తహసీల్దార్
RELATED ARTICLES
Recent Comments