Saturday, April 5, 2025
Homeక్రైమ్ఇంటి అనుమతికి రూ.10వేలు..

ఇంటి అనుమతికి రూ.10వేలు..

ఇంటి అనుమతికి రూ.10వేలు..
పంచాయతీ రాజ్ శాఖ ఏఈ డిమాండ్..
మధ్యవర్తితో డీల్..
మాటు వేసి పట్టుకున్న ఏసీబీ..
స్పాట్ వాయిస్, సంగెం: రూ.10వేలు డిమాండ్ చేసిన అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నుంచి ఇంటి నిర్మాణ అనుమతులకు క్లియరెన్స్ ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏఈ రమేష్ ఇంటి నిర్మాణ అనుమతి కోసం 80వేల డబ్బులు డిమాండ్ చేశాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యపేరు ఇంటి నిర్మాణానికి కుడాలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ ఏఈ రమేష్ తన దగ్గర ఉండే మధ్యవర్తి గుగులోతు సారయ్య ద్వారా రూ.10వేలు డిమాండ్ చేశారు. సారయ్యతో ఒప్పందం కుదర్చుకున్న బాధితుడు అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు సోమవారం హన్మకొండలోని డీమార్ట్ వెనుకాల ఓ ప్రాంతంలో బాధితుడి నుంచి రూ.10 వేల నగదు స్వీకరిస్తుండగా సారయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అలాగే సంఘటనా స్థలంలో ఏఈ, ఆయన ద్విచక్రవాహనం ఉండటం, ఇతర వివరాలు మ్యాచ్ అవడంతో ఏఈ రమేష్ పై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. లంచం డిమాండ్ చేసిన ఏఈ రమేష్ ను ఏ-1గా, లంచం తీసుకుంటుంగా చిక్కిన గుగులోతు సారయ్యను ఏ2- గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. భద్రతా చర్యల రీత్యా బాధితుడి వివరాలను వెల్లడించడం లేదని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments