భూపాలపల్లి కలెక్టరేట్ లో ఏసీబీ రైడ్
రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఏఎస్ వో
స్పాట్ వాయిస్, భూపాలపల్లి : భూపాలపల్లి కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. రేగొండ రెవెన్యూ కార్యాలయంలో ఏఎస్ వోగా పని చేస్తున్న మొగుళ్ల రఘుపతి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలు… రేగొండ మండల కేంద్రానికి చెందిన వడ్లకొండ మల్లికార్జున్ వాళ్ల అత్తమ్మ డెత్ సర్టిఫికెట్ కోసం ఏఎస్ వో మొగుళ్ల రఘుపతి రూ. 2 వేలు డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద డబ్బులు తీసుకుంటుండగా అతడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం రఘుపతిని కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయానికి తీసుకుకెళ్లి అధికారులు విచారణ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
భూపాలపల్లి లో ఏసీబీ దాడులు..
RELATED ARTICLES
Recent Comments