ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఆడిట్ అధికారులు
డబ్బులు ఇస్తుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టివేత
కార్యాలయంతోపాటు ఇళ్లల్లో సోదాలు
స్పాట్ వాయిస్, మహబూబాబాద్ : ఓ రిటైర్డ్ కానిస్టేబుల్ నుంచి లంచం తీసుకుంటుండగా ఇద్దరు ఆడిట్ అధికారులు ఏసీబీకి చిక్కారు. వివరాలిలా ఉన్నాయి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న కానిస్టేబుల్ పెన్షన్ డబ్బుల కోసం కొద్ది రోజులుగా మహబూబాబాద్ ఆడిట్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే బాధితుడి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న జూనియర్ అసిస్టెంట్ ఆడిటర్ శ్రీనివాస్ , సీనియర్ అసిస్టెంట్ ఆడిటర్ కిశోర్‌కుమార్ అతడిని రూ. 25 వేలు డిమాండ్ చేశారు. దీంతో శుక్రవారం డబ్బులతో వచ్చిన బాధితుడు జూనియర్ అసిస్టెంట్ ఆడిటర్ శ్రీనివాస్ ఫోన్ చేయగా తాను అందుబాటులో లేనని ఆ డబ్బులను సీనియర్ అసిస్టెంట్ ఆడిటర్ కు ఇవ్వాలని సూచించాడు. దీంతో ఆడిట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఆడిటర్ జాటోత్ కిశోర్‌కుమార్ రూ. 18 వేలు ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే బృందాలుగా ఏర్పడిన అధికారులు ఆడిట్ కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేయడంతో పాటు నిందితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఆడిట్ అధికారులు
RELATED ARTICLES
Recent Comments