Friday, April 18, 2025
Homeజిల్లా వార్తలుఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగులు

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగులు

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగులు
రూ.15వేలు తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్, బిల్ కలెక్టర్
కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: కాశీబుగ్గ సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నిజాంపుర కు చెందిన వ్యక్తి నుంచి సర్కిల్ ఆఫీస్ లో రూ.15 వేలు నగదు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రబ్బాని, బిల్ కలెక్టర్ రంజిత్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రబ్బాని, రంజిత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాశీబుగ్గ సర్కిల్ ఆఫీసులో సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అవినీతి ఆరోపణలకు కేరాఫ్ గా మారిన జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. మొత్తంగా ఏసీబీ అధికారుల రైడ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments