Wednesday, April 9, 2025
Homeక్రైమ్పేలిన ఏసీ...

పేలిన ఏసీ…

పేలిన ఏసీ
తల్లి..,ఇద్దరు కూతుర్ల సజీవ దహనం

స్పాట్ వాయిస్, డెస్క్: కర్ణాటక రాష్ట్ర రాయచూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంట్లో ఏసీ పేలడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు.రాయచూరు తాలూకా శక్తినగర్ కేపీసీఎల్ కాలనీలో ఈ ఘటన సోమవారం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కూతుళ్లు సజీవ దహనమయ్యారు. మృతులు రంజిత (33), మృదుల (13), తారుణ్య(5)గా గుర్తించినట్లు శక్తి నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపారు. ఇంట్లోని ఏసీలో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నారు. అయితే, ఇంట్లో మంటలు పూర్తిగా అలుముకోవడానికి స్పష్టమైన కారణాలు తెలియ రాలేదు.శక్తి నగర్ థర్మల్ కేంద్రంలో ఏఈగా పనిచేస్తున్న సిద్ధ లింగయ్య కుటుంబం ఈ ప్రమాదానికి గురైంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments