Saturday, April 5, 2025
Homeలేటెస్ట్ న్యూస్సుఫారీ ఇచ్చి మరీ భర్తను చంపించిన భార్య

సుఫారీ ఇచ్చి మరీ భర్తను చంపించిన భార్య

సుఫారీ ఇచ్చి మరీ భర్తను చంపించిన భార్య
ఏమీ తెలియనట్టు భర్త మిస్సింగ్ అంటూ ఫిర్యాదు..
హన్మకొండ జిల్లాలో మర్డర్

స్పాట్ వాయిస్, కాజీపేట : వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సుఫారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించింది ఓ భార్య. మూడునెలల పాటు కొనసాగిన ఈ క్రైమ్ కథకు పోలీసులు నేటితో తెరదించారు. సూత్రధారితో పాటు మరో ముగ్గురు నిందితులను కాజీపేట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాజీపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ అశోక్ మర్డర్ వివరాలు వెల్లడించారు.

1) జన్నారపు సుష్మిత వేణుకుమార్ భార్య. కాజీపేటలోని డీజిల్ కాలనీలో ఉంటుంది.
2) నెక్కొండకు చెందిన కొంగర అనిల్
3) హన్మకొండ వడ్డేపల్లిలోని సప్తగిరి కాలనీకి చెందిన గడ్డం రత్నాకర్
4) మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటకు చెందిన కటిక నవీస్

వేణు కుమార్ (34), చిట్టీలు, గిరిగిరి నిర్వహిస్తూ కాజీపేటలోని డీజిల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మృతుడికి ఇద్దరు భార్యలు ప్రధాన నిందితురాలైన మొదటి భార్య ఉన్నారపు సుష్మిత కాజీపేట లోకో షెడ్ లో టెక్నీషన్-1గా పనిచేస్తోంది. రెండో భార్య సంతోష్ ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటుంది. మొదటి భార్యకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, రెండో భార్యకు కుమారుడు ఉన్నాడు. వీరందరూ డీజిల్ కాలనీలోనే నివాసం ఉండేవారు. కొద్ది రోజులుగా మృతుడు వేణు కుమార్ మహబూబాబాద్ లో మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారంతో నిందితురాలైన మొదటి భార్య సుస్మిత మృతుడు మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. అయినా మృతుడు మారకపోగా.. తన ఇద్దరు భార్యలను మానసికంగా శారీకంగా హింసిస్తూ ఉండేవాడు. దీనితో తన భర్తకు బుద్ధి చెప్పాలని నిందితురాలైన మొదటి భార్య సుష్మిత నిర్ణయించుకుంది. ఇందుకోసం నిందితురాలికి సమీప బంధువైన మరో నిందితుడు కొంగర అనిల్ కు ఈ విషయం చెప్పింది. నిందితుడు అనిల్ తనకు పరిచయం ఉన్న మరో ఇద్దరు నిందితులైన గడ్డం రత్నాకర్, కటిక నవీన్ సాయంతో మృతుడు వేణు కుమార్ ను హత్య చేయించేందుకు ప్లాన్ వేశాడు. ఇందుకోసం గడ్డం రత్నాకర్ 4 లక్షల ఒప్పందం చేసుకొని రెండు లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు.
స్లీపింగ్ టాబ్లె్ట్స్ వేసి..
పథకం ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి సుష్మిత వేణు కుమార్ కు స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి ఇచ్చింది. తర్వాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. అనిల్ కి ఫోన్ చేసి చెప్పింది. కొద్దిసేపటి తర్వాత అనిల్, రత్నాకర్ సుష్మిత ఇంటిలోకి వేణు కుమార్‌ను అనిల్, రత్నాకర్ కారు వెనుక సీట్లో వేసుకొని మంథిని, పెద్దపల్లి జిల్లా దగ్గర ఉన్న మానేరు వాగులో వేణు కుమార్ శవాన్ని పడేశారు. మధ్యలో పరకాల వద్ద కటిక నవీన్, అనిల్ కారు ఎక్కి వేణు కుమార్ శవాన్ని వాగులో వేయడానికి అనిల్, రత్నాకర్ కి సాయం చేశాడు. ఆ తరువాత ముగ్గురు కలిసి హన్మకొండకు కారులో వచ్చారు.

భర్త కనిపించడం లేదని…
తన భర్త కనబడటం లేదంటూ సుష్మిత కాజీపేటలో పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 7న ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న కాజీపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు చేసిన మొదటి భార్య పై పోలీసులకు అనుమానం రావడంతో నిందితురాలైన మొదటి భార్య సుష్మిత స్వచ్ఛందంగా లొంగిపోయి తాను చేసిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించింది. ఈమె ఇచ్చిన వాంగ్మూలం తో మిగతా ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మంథని పోలీసుల సహకారంతో మృతుడి శవాన్ని వెలికి తీసి కేసు -నమోదు చేశారు. స్థానిక తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని మృతుని బంధువులకు అప్పగించారు. ఈ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు.
అభినందనలు
హత్య కేసును సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ సూచనల ప్రకారం మర్డర్ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన కాజీపేట సీఐ జి.మహేందర్ రెడ్డి, ఎస్సైలు ప్రమోద్ కుమార్, రవికుమార్, వెంకటేశ్వర్లు, సల్మాన్ పాషా ఏవీ, పీసీలు భాస్కర్, మధు, శ్రీనివాస్, వేణు, సతీష్ రెడ్డి, రమేశ్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments