ఏంటది..? ఎలా పడిందని ఆరా..
చూసేందుకు పరుగులు తీస్తున్న జనం..
స్పాట్ వాయిస్, వికారాబాద్: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఓ వింత శకటం ఆకాశం నుంచి పడింది. ఆదిత్య 369 సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటాన్ని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి పంటపోలాల్లో ఈ వింత వాహనం పడడంతో గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల వారంతా భారీగా తరలివచ్చి వింతగా చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చి పడిందోనని కొంతమంది గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. కాగా ఇది టాటా కన్సల్టెన్సీ వాళ్లు రూపొందించిన ప్రయోగం అని, దీనివలన వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పినట్లు సమాచారం.
Recent Comments