స్పాట్ వాయిస్, వరంగల్ : ఎంజీఎం ఆస్పత్రిలో పాము కలకలం సృష్టించింది. శుక్రవారం ఆస్పత్రిలోకి పాము రావడంతో రోగులు, వారి బంధవులు భయంతో పరుగులు తీశారు. పాము ఫీవర్ వార్డులోని బాత్ రూంలోకి వెళ్లింది. కదలలేని పరిస్థితుల్లో ఉండే రోగులున్న గదుల్లోకి పాము రావడంపై వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో అపరిశుభ్ర వాతావరణం, పొదలు ఉండడం వల్లే పాములు, ఎలుకలు తీరుగుతున్నాయంటూ మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలోకి పేషెంట్ ను ఎలుకలు కరిచిన విషయం తెలిసిందే.
Recent Comments