Sunday, April 6, 2025
Homeక్రైమ్అర్ధరాత్రి కారు దగ్ధం

అర్ధరాత్రి కారు దగ్ధం

కొయ్యూరు ప్రధాన రహదారిపై ఘటన
స్పాట్ వాయిస్,మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు ప్రధాన రహదారిపై పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ కార్ లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. అర్ధరాత్రి ఘటన జరగడంతో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారా లేక, ప్రమాదవశాత్తు జరిగిందా అనే అనుమానాలు నెలకొన్నాయి. సంఘటన జరిగిన సమీపంలో ఉన్న హోటల్ లోకి మంటలు అంటుకోకుండా హోటల్ యజమానులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కారు ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కారు ఎవరిది, ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం పోలీస్‌ల విచారణలో తేలనుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments