రూ. 2,24,967 లక్షలు మాయం..
బాధితుడు పరకాల ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్
స్పాట్ వాయిస్, పరకాల: సైబర్ నేరగాళ్లు.. బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కే వల విసిరారు. బ్యాంకు ఖాతాదారులను అప్రమత్తం చేయాల్సిన అధికారి అకౌంట్ ఖాళీ చేసుకొని గొల్లుమన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని పరకాల ఎస్ బీఐ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ గా సకల్ దేవ్ సింగ్ పని చేస్తున్నాడు. ఆయనకు రెండు రోజుల క్రితం ఆయన మొబైల్ కు ‘మీ ఖాతా డీ యాక్టివేట్ అవుతుంది.. పాన్ కార్డు అప్డేట్. చేయండి’ అంటూ అని మెసేజ్ వచ్చింది. ఆయన శుక్రవారం ఉదయం ఆ మెసేజ్ ను క్లిక్ చేసి అప్డేట్ చేసేందుకు ప్రయత్నించగా సక్సెస్ కాలేదు. అనంతరం మరో నంబరు నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. తాను చెప్పినట్టు చేయాలని అవతలి వ్యక్తి సూచించగా.. నేను బస్సులో ఉన్నాను… తర్వాత చేస్తానని సకల్దేవ్ సింగ్ చెప్పారు. బ్యాంకుకు వెళ్లిన తర్వాత ఆయనే తనకు వచ్చిన నంబర్ కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి పాన్ కార్డు అప్ డేట్ చేయాలని సూచించగా కావడం లేదని చెప్పారు. ఆ వెంటనే వాట్సాప్ కు ఒక లింక్ పంపానని, దాన్ని ఓపెన్ చేయాలని ఆ వ్యక్తి చెప్పాడు. ఈమేరకు వేరే నంబరు నుంచి లింక్ పంపించగా.. దాన్ని ఓపెన్ చేశారు. దీంతో ఆయన ఖాతాలోంచి రూ. 2,24,967 కట్ అయ్యాయి. దీంతో శుక్రవారం రాత్రి పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేుస్తున్నారు.
బ్యాంకు అధికారికే సైబర్ నేరగాళ్ల టోకరా
RELATED ARTICLES
Recent Comments