Saturday, September 21, 2024
Homeకెరీర్ఇంటర్‌లో 100 శాతం సిలబస్

ఇంటర్‌లో 100 శాతం సిలబస్

రెండేళ్లుగా 70శాతంతో నిర్వహణ
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ఇంట‌ర్ బోర్డు కీల‌క నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవ‌త్సరం ఇంటర్ విద్యార్థులకు పూర్తిస్థాయి సిల‌బ‌స్‌ను అమ‌లు చేస్తున్నట్లు ప్రక‌టించింది. క‌రోనా ఎఫెక్ట్‌తో రెండేళ్లుగా 70 శాతం సిల‌బ‌స్‌ను మాత్రమే అమలు చేశారు. అయితే ఈ అకాడమిక్ ఇయర్ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ లో వంద శాతం సిల‌బ‌స్‌ను అమ‌లు చేస్తున్నట్లు ఇంట‌ర్ బోర్డు కార్యద‌ర్శి ఉమ‌ర్ జ‌లీల్ ప్రక‌టించారు. ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు వెబ్‌సైట్‌లో త్వర‌లోనే సిల‌బ‌స్‌ను అప్‌లోడ్ చేస్తామ‌ని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, కాలేజీల సిబ్బంది ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments