కుటుంబ కలహాలు..
తండ్రిని చంపిన కొడుకు..
స్పాట్ వాయిస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్‌లో కుటుంబ కలహాలతో కొడుకు చేతిలో తండ్రి హత్యకు గరయ్యాడు. గ్రామానికి చెందిన శనిగల రవి మద్యం మత్తులో భార్యతో రోజు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం మత్తులో భార్యతో రవి గొడవ పెట్టుకున్నాడు. అయితే వారిద్దరికి సర్థి చెప్పేందుకు కొడుకు శివ ప్రయత్నం చేశాడు. ఎంత చెప్పిన తండ్రి వినకపోవడంతో ఆగ్రహంతో శివ.. అతడిపై కత్తితో దాడిచేశాడు. దీంతో రవి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments