Sunday, April 6, 2025
Homeకెరీర్యూనివర్సిటీల్లో నియామకాల కోసం కామన్ బోర్డు

యూనివర్సిటీల్లో నియామకాల కోసం కామన్ బోర్డు

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది నిమాయకాల కోసం రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల్లో ఇకపై బోధన, బోధనేతర సిబ్బంది నియామకం ఉమ్మడి బోర్డు ద్వారా చేపట్టనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ అధ్యక్షుడిగా, విద్య, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులను బోర్డులో సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ బోర్డు కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరమైతే మరో సభ్యుడిగా నిపుణులను నియమించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బోర్డు విధివిధానాలు, నియామక ప్రక్రియ ఎలా చేపట్టాలి..? తదితర అంశాలపై త్వరలో స్పష్టత రానుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments