బాలికపై సామూహిక లైగింకదాడి
స్పాట్ వాయిస్, క్రైమ్: రాష్ట్ర రాజధానిలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. జూబ్లీహిల్స్ ఘటన మరవక ముందే రోజుకో దారుణం బయటకొస్తోంది. హైదరాబాద్ ఛత్రినాక పరిధిలో 17 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడి జరిగింది. బాలికపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసుల వివరాల ప్రకారం తెలుస్తోంది. అలీ అనే యువకుడితో ఉప్పుగూడా ప్రాంతానికి చెందిన బాధిత బాలికకు పరిచయం ఉంది. బాలికను ఇంటికి పిలిచి స్నేహితుడు అర్బాస్తో కలిసి అలీ లైంగికదాడికి తెగించాడు. ఈ విషయంపై బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని భరోసా సెంటర్కు పంపించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అలీ, అర్బాస్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల్లో ఒకరు బాధిత బాలిక బంధువుగా పోలీసులు గుర్తించారు.
Recent Comments