స్పాట్ వాయిస్, డెస్క్: ఓ ఇద్దరు దంపతులు కలిసి ఓ ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. అక్కడి నదిలో స్నానం చేస్తుండగా భర్త తన భార్యకు మద్దుపెట్టాడు. అయితే అక్కడే ఉన్న కొందరు దీనిని గమనించి ఇదేం పద్దతంటూ తిట్టిపోయడమే కాకుండా చేయిచేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్తను కొడుతుంటే పాపం అతని భార్య రక్షించడానికి ప్రయత్ని్ంచినా లాభం లేకుండా పోయింది. అప్పటికే చాలామంది అతన్ని చుట్టుముట్టడంతో ఆమె కూడా ఏం చేయలేకపోయింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు అయోధ్య పోలీసులను కోరారు.
Recent Comments