స్పాట్ వాయిస్, ఓరుగల్లు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ‘అగ్నిపథ్’ స్కీమ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువతపై పోలీసులు కాల్పులు జరపడాన్ని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఖండించారు. కాల్పులు జరిపిన పోలీసులపై హత్యాయత్నం కింద కేసు పెట్టి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఘటనలో మరణించిన రాకేశ్ కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే గాయపడిన 13 మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. అగ్నిపథ్ స్కీమ్ దుష్టమైందని, దాన్ని రద్దు చేయాలని జగన్ పేర్కొన్నారు. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించే పథకంలో భాగంగానే అగ్నిపథ్ స్కీమ్ ను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని చెల్లించడంతో పాటు దేశంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని భర్తీ చేయాలని కోరారు.
Recent Comments