Monday, September 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్నర్సంపేటలో హైటెన్షన్

నర్సంపేటలో హైటెన్షన్

కొనసాగుతున్న రాకేశ్ అంతిమ యాత్ర
తరలివచ్చిన గులాబీ శ్రేణులు
పట్టణంలో ఒక వైపు కాంగ్రెస్, మరోవైపు కమ్యూనిస్టులు
స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట పట్టణంలో హై టెన్షన్ నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో మృతి చెందిన రాకేశ్ అంతిమయాత్ర వరంగల్ జిల్లాలో నిర్వహించారు. అంతిమ యాత్ర నర్సంపేట మీదుగా వెళ్తుండడంతో ఇక్కడ హై టెన్షన్ నెలకొంది. ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు కమ్యూనిస్ట్ పార్టీలు, ఇంకో వైపు టీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుడు రాకేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్ర తీరును నిరసిస్తూ టీఆర్ ఎస్ శ్రేణులు రాకేశ్ అంతిమ యాత్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. భారీగా గులాబీ శ్రేణులు రావడంతో.. నర్సంపేట పట్టణం కిక్కిరిసిపోయింది. ఈ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరు వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ.. కమ్యూనిస్టు పార్టీలు తరలివచ్చాయి. దీంతో పోలీసుల బలగాలు భారీగా మోహరించాయి. ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments