Saturday, September 21, 2024
Homeజనరల్ న్యూస్ఈ వారం మీ రాశీఫలం..

ఈ వారం మీ రాశీఫలం..

వార రాశిఫలాలు (12-06-2022 to 18-06-2022)
మేషం:
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.
వృషభం:
అనుకున్న పనులలో జాప్యం కలిగిన కొంత నిదానంగా పూర్తి అవుతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
మిథునం:
నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలు సంభందించి అవరోధాలు అధిగమిస్తారు.
కర్కాటకం:
గృహమున చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరుతాయి. సకాలంలో ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి.
సింహం:-
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారమవుతాయి. స్వంత ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు.
కన్య:
చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.
తుల:-
గృహప్రవేశం నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఏ పని ప్రారంభించినా అప్రయత్నంగా పూర్తవుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికం:
చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి.
ధనుస్సు:
కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఇంటాబయట అందరు మీ మాటతో విభేదిస్తారు. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి.
మకరం:
నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అందరిలోనూ మీకు ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ప్రత్యర్థులు కుడా అనుకూలంగా మారతారు. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
కుంభం:-
నూతన కార్యక్రమాలను ప్రారంభానికి శ్రీకారం చుడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి.
మీనం:
కుటుంబ సమస్యలు నిదానంగా పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులలో కొంత జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments