జాతీయ రాజకీయాల్లోకి వెళ్లుడే.. బీజేపీని దించుడే
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
స్పాట్ వాయిస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ కనుసైగల్లో 15 రాష్ట్రాలు పనిచేస్తున్నాయని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లుడే.. బీజేపీని దించుడేనని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. శనివారం టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని విమర్శించారు. గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై ఇక్కడ తీసుకొస్తున్నారన్నారు. గవర్నర్ కు రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలన్నారు. గవర్నర్‌గా ఉండి రాజకీయాలు చేయడానికి తాము వ్యతిరేకమని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని బీజేపీ కుట్రలకు తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీ మహిళా నేతలతో దర్బార్ పెడితే అది మహిళా దర్బార్ అవుతుందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడుతున్నారని జీవన్‌రెడ్డి చెప్పారు. గుజరాత్ సీఎంగా పనిచేసిన మోదీ.. ప్రధాని అయ్యారు. తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్.. దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పేంటని ప్రశ్నించారు.
Recent Comments