Saturday, November 23, 2024

కరోనా పోలే..

గత వారం 355, ఈ వారం 555 కేసుల నమోదు
మాస్క్ తో పాటు జాగ్రత్తలు అవసరం
త్వరలోనే ఇంటింటికీ వ్యాక్సినేషన్
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. కేసుల పెరుగుదలపై ఆందోళన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ తరపున శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నా ఆస్పత్రుల్లో చేరికలు లేవని, మరణాలు లేవని చెప్పారు. రాష్ట్రంలో గత వారం 355 కేసులు నమోదు అయ్యాయి. ఈ వారంలో 555 కేసులు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలో సుమారు 56 శాతం కేసుల పెరుగుదల నమోదైనట్లు పేర్కొన్నారు. అలాగే దేశంలోనూ కేసుల సంఖ్య 66 శాతం పెరిగిందని డీహెచ్‌ వెల్లడించారు. రాష్ర్టంలో కరోనా వైరస్ మొత్తం పోలేదని, సబ్‌ వేరియెంట్స్‌ కొంత ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. వచ్చే డిసెంబర్‌ వరకు ఇలాగే ఉండే అవకాశం ఉందన్నారు. అయితే ఆందోళన అక్కర్లేదని, మాస్క్‌ ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జ్వరం, తలనొప్పి, వాసన లేకపోతే కచ్చితంగా టెస్ట్‌ చేయించుకోవాలని చెప్పారు. త్వరలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నట్లు చెప్పారు. 12-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌ అందుబాటులోనే ఉన్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments