Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్రైతుబంధుపై తేల్చేనా..?

రైతుబంధుపై తేల్చేనా..?

నేటికి అందని ఖబురు
నేడు మంత్రులతో సీఎం భేటి..
ప్రకటన కోసం ఎదురుచూస్తున్న రైతులు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రైతుల పంట పెట్టుబడికి సాయంగా నిలుస్తున్న రైతు బంధు ఊసే ఈసారి వినబడడం లేదు. యాసంగి పంటలు వేయని రైతులు, అకాల వానతో పంటలు దెబ్బతిన్న రైతులు ప్రభుత్వం అందించే రైతు బంధు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. చినుకుపడానికి ముందే ప్రభుత్వం ఇస్తే విత్తనపు గింజలు కొనుక్కోవచ్చని చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి నేటికీ కబురు రాలేదు. గతేడాది మే నెలలోనే రైతుబంధు డబ్బులు వేసే తేదీని ప్రకటించి జూన్ 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమచేసింది. అయితే మరో రెండుమూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ర్టాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రైతులు దుక్కి దున్ని విత్తనాలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారు. గతేడాది చీడలు, వర్షాల వల్ల పంటల దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీంతో పంటలకు డిమాండ్ ఉన్నా.. రైతులకు ఫాయిదా లేకుండా పోయింది. ఈసారి ప్రభుత్వం ఇచ్చే సాయంతో ముందుగా విత్తనాలు వేద్దామనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. నేటికీ రైతుబంధు పంపిణీ విషయమై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు.
నేడు మంత్రులతో సీఎం సమావేశం..
సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్ లో మంత్రులతో భేటి కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధుపై నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments