స్పాట్ వాయిస్, హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గా పని చేస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రమోషన్ వచ్చింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యుక్షుడిగా నియమిస్తూ గురువారం ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గురుకుల పాఠశాల కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఎంతో మంది విద్యార్థులు ఆయన హయాంలో డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, క్రీడాకారులుగా ఎదిగారు. అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. చీఫ్ కోఆర్డినేటర్ గా ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ పేరుతో కొన్ని నెలలుగా గ్రామాల్లో తిరుగుతున్నారు. బీఎస్పీని అధికారంలోకి తీసుకురావడానికి బాగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పనితీరుకు మెచ్చిన జాతీయం నాయకత్వం… ఆయన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. శుక్రవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ రాష్ట్ర ఇన్ చార్జ్, ఎంపీ రాంజీ గౌతమ్ హాజరుకానున్నారు.
Recent Comments