*కాజీపేట రైల్వే జంక్షన్ లో భారీ నగదు
జీఆర్పీలో కేసు నమోదు
స్పాట్ వాయిస్ కాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్ లో భారీ నగదు లభ్యమైన సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. రైల్వే జీఆర్పీ ఎస్సై అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట రైల్వే జంక్షన్లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫారంపై ఆర్పీఎఫ్, రైల్వే సీబీఐ, జీఆర్పీ పోలీసులు బుధవారం సంయుక్తంగా విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ ఫారంపై వ్యక్తి ఏడు, ఎనిమిది బ్యాగ్లతో అనుమానంగా కనిపించాడు. ఆ బ్యాగ్ లలో ఒక్క బ్యాగ్ కు మాత్రమే తాళం వేసి ఉంది. దీంతో వారు ఆ బ్యాగ్ లో ఏముందని తెరిచి చూడడంతో భారీ నగదు వెలుగు చూసింది. వెంటనే ఆ వ్యక్తిని ఆర్పీఎఫ్ స్టేషన్ కు తీసుకెళ్లారు. డబ్బులు ఎక్కడివని ఆరా తీయడంతో మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన కిశోర్ పులే అని కొంత కాలంగా కాజీపేట ప్రాంతంలో నివాసం ఉంటున్నామన్నారు. తమ భూమిని అమ్ముకుని రూ. 74.87 లక్షల రూపాయలతో నాగపూర్ కు వెళ్లుతున్నామని చెప్పారు. డబ్బులకు ఎలాంటి ఆధారాలు చూపకుండ పొంతనలేని సమాధాలు వెల్లడించారని చెప్పారు. కిషోర్ పులే పై జీఆర్పీ స్టేషన్లో కేసు నమోదు చేసి.. నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించామని తెలిపారు.
కాజీపేట రైల్వే జంక్షన్ లో నోట్ల కట్టలు…
RELATED ARTICLES
Recent Comments