అప్రమత్తంగా ఉండండి
ప్రభుత్వానికి హైకోర్టు సూచన
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కేసులు పెరుగుతున్నందున తగిన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు 15 రోజుల్లో ఎక్స్గ్రేషియా చెల్లించేలా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.
కరోనా కేసులు పెరుగుతున్నాయి..
RELATED ARTICLES
Recent Comments