స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ విభాగాధిపతి కార్యాలయంలో 196 పోస్టులు, పబ్లిక్ హెల్త్‌లో236, చీఫ్ ఇంజినీర్ రూరల్ వాటర్ సప్లైలో 420 పోస్టులు, 350 ఇంజినీర్ ఇన్ చీఫ్ పంచాయతీ రాజ్ జనరల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
మెడికల్ విభాగంలో..
మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 12,775 ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలని, అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో తొలి విడతగా 1,326 ఎంబీబీఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు.
.
1,433 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
RELATED ARTICLES
Recent Comments