ఆ ఫొటోలు, వీడియో బయటపెట్టినందుకే..
స్పాట్ వాయిస్, బ్యూరో: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ లైంగికదాడి కేసులో బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారని న్యాయవాది ఫిర్యాదు మేరకు రఘునందన్‌రావుపై కేసు నమోదైంది. ఐపీసీ 223(a) సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రఘునందన్‌రావు ప్రెస్మీట్లో జూబ్లీహిల్స్ ఘటనకు సంబంధించిన ఆధారాలను మీడియా ఎదుట బయటపెట్టారు. తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని పోలీసులు, న్యాయస్థానానికి అందజేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. ఆ ఫొటోల్లో ఉన్నది ఓ ఎమ్మెల్యే కుమారుడని రఘునందన్ రావు ఆరోపించారు. మరోవైపు సాముహిక లైంగికదాడి బాధితురాలికి సంబంధించిన వివరాలను రిలీజ్ చేసిన జర్నలిస్టు సుభాన్పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు
RELATED ARTICLES
Recent Comments