Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలురెడ్ క్రాస్ సేవలు అభినందనీయం..

రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం..

స్పాట్ వాయిస్, సుబేదారి : హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గం కోరిక మేరకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ) రక్త కేంద్రానికి అత్యాధునిక పరికరాల కొనుగోలుకు రూ.1.45 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఆ నిధులతో కొనుగోలు చేసిన పరికరాలను సోమవారం తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా, హన్మకొండ కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ హన్మంతు ప్రారంభించారు. ముందుగా ఆర్ఈసీ ప్రతినిధులకు పాలకవర్గం స్వాగతం పలికి ఆవరణలో ఉన్న రెడ్ క్రాస్ జెనరిక్ మందుల షాప్, టైలరింగ్, జూనియర్, యూత్ రెడ్ క్రాస్, డిసాస్టర్ సెల్ గురించి వివరించారు. అనంతరం తలసీమియా సెంటర్ ను సందర్శించి పిల్లలతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. తలసీమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలకు పాలకవర్గాన్ని అభినందించారు. రెడ్ క్రాస్ లో నడుస్తున్న రక్త కేంద్రాన్ని సందర్శించి సంస్థ ద్వారా అందించిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ చీఫ్ ప్రోగ్రాం మేనేజర్ ఎన్.వెంకటేశన్ మాట్లాడుతూ హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా స్వచ్ఛంద రక్తదాతల ద్వారా సేకరించిన రక్తాన్ని బాధితులకు అందించడానికి అవసరమైన పరికరాలను ఆర్ఈసీ ద్వారా సమకూర్చడం సంతోషంగా ఉందన్నారు. పాలక వర్గం చేస్తున్న సేవ కార్యక్రమాలకు ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరికరాలు సమకూర్చుకోవడానికి నిధులు మంజూరు చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా మాట్లాడుతూ ఆర్ఈసీ అధికార్లకు అభినందనలు తెలిపారు. తెలంగాణలోనే హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గం చురుకుగ్గా పనిచేస్తుందని అభినందించారు. ఈ సందర్భంగా హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్ జిల్లా, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు పెద్ది వెంకటనారాయణ గౌడ్, ఈవీ శ్రీనివాస్ రావు, బొమ్మినేని పాపి రెడ్డి, డీఎంహెచ్ వో బి.సాంబశివరావు ను కలెక్టర్, తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శాలువా, షీల్డ్ తో సన్మానించారు. కార్యక్రమంలో ఐఆర్సీఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ కే.మదన్ మోహనరావు, వైస్ చైర్మన్ డాక్టర్ కె.సుధాకర్ రెడ్డి, జిల్లా పాలకవర్గ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాస్ రావు, మేనేజర్ టి.ప్రవీణ్, పరికరాల ఏజెన్సీ ప్రతినిధులు జి.వెంకట్, వేణుగోపాల్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నిట్ అబ్దుల్ కలాం గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా మర్యాద పూర్వకంగా కలిసి రెడ్ క్రాస్ కార్యక్రమాలపై చర్చించి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments