Wednesday, May 21, 2025
Homeతెలంగాణరైతులకు గుడ్ న్యూస్

రైతులకు గుడ్ న్యూస్

రేపు రాష్ర్టానికి రుతుపవనాలు
ఇప్పటికే చల్లబడిన వాతావరణం..
ఆశగా ఎదురుచూస్తున్న రైతులు
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈనెల 10 నాటికి పూర్తిస్థాయిలో రాష్ట్రంలో వ్యాపిస్తాయని, చురుగ్గా కదలడంతో.. ఈసారి సాధరణం కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే.. రుతుపవనాల రాక రెండ్రోజులు ఆలస్యమైనట్లు తెలిపింది. మే 29నే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ.. వాటి కదలిక ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లోకి రుతుపవనాల ప్రవేశించడం ఆలస్యమైంది. అయితే ఆదివారం సాయంత్రం నుంచి వాతావరణం కాస్త చల్లబడింది. రాష్ర్టంలోని పలు చోట్ల చినుకులు పడ్డాయి. పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు. ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలు కాస్తా ఊరటచెందారు. తొలకరి చిలకరిస్తే.. జనాలకు ఎండాకాలం నుంచి ఉపశమనం లభించనుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments