Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలుగురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడిగా వేణు

గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడిగా వేణు

గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడిగా వేణు

స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట మండలం గురిజాల గ్రామ ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడిగా గొలనకొండ వేణును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శ్రేయస్సే ప్రధాన లక్ష్యంతో ఏర్పాటు చేసిన గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక నూతన కమిటీని ఆదివారం గురిజాల హైస్కూల్ ఆవరణలో గౌరవ అధ్యక్షుడు బండారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఆరె కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా చుక్క రాజేందర్, సహాయ కార్యదర్శిగా జమాండ్ల రాజేందర్, కోశాధికారిగా డ్యాగల వెంకట్రాంనర్సయ్య, ప్రచార కార్యదర్శిగా నీలం రాజ్ కుమార్ ను ఎన్నుకున్నారు. అలాగే డైరెక్టర్లుగా నామాల అశోక్ కుమార్, అల్లి రవి, ఆముదాల లక్ష్మీనారాయణ, బండారి శ్రీనివాస్ (లాయర్), అన్న రాజశేఖర్ నియామకం అయ్యారు. 27 మంది ముఖ్య గౌరవ సలహాదారుల సలహాలు, సూచనలతో నూతన కమిటీ పని చేస్తుందని, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములై, గ్రామ సంక్షేమం కోసం పాటుపడుతుందని అధ్యక్షుడు గొలనకొండ వేణు, ప్రధాన కార్యదర్శి చుక్క రాజేందర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments