Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్అవ్వ చేతి బువ్వ.. ఎంత కమ్మనో...

అవ్వ చేతి బువ్వ.. ఎంత కమ్మనో…

పరిశుభ్రత పాటించాలి..
ప్రజలకు అవగాహన కలిపించిన మంత్రి ఎర్రబెల్లి

స్పాట్ వాయిస్, తొర్రూరు: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి లో భాగంగా 3వ రోజు ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఊరూరా తిరుగుతూ పల్లె ప్రగతి కార్యక్రమాల్లో చురుగా పాల్గొన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ, ఉత్తేజ పరుస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి గ్రామంలో వాడవాడలా తిరిగారు. ప్రజలతో మాట్లాడుతూ.. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు.చెత్తా చెదారం ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కాలువల్లో మట్టి, చెత్త పేరుకుపోవడం చూసి, వెంటనే సఫాయి పని చేశారు. కాలువలో మట్టిని తీసేశారు. అలాగే గ్రామస్థులను పలకరిస్తూ, వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. గ్రామ కార్యదర్శిని పిలిచి మరింత జాగ్రత్తగా పని, పర్యవేక్షణ చేయాలని హెచ్చరించారు . కొడకండ్ల మండలం రేగులలో మంత్రి ఉపాధి హామీ కూలీలతో మమేకం అయ్యారు. వారితో కలిసి పని చేశారు. వారి పనితీరు, అందుతున్న కూలీ, జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఉపాధి కూలీలు పెట్టిన చద్దన్నం తిన్నారు. అవ్వ.. బువ్వ కమ్మగా ఉందంటూ… అందరినీ సంతోష పెట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments