Tuesday, November 19, 2024
Homeజిల్లా వార్తలురైతులను కొట్టిన ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలి

రైతులను కొట్టిన ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలి

ఖమ్మం -వరంగల్ హైవే దిగ్బంధం

కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు

స్పాట్ వాయిస్, వర్ధన్నపేట : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం రైతుల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ, ఎస్ఐ లను వసస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేస్తూ ఖమ్మం- వరంగల్ ప్రధాన రహదారి పంథిని వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ రైతులు ఏం తప్పు చేసారని వారిని
అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుకపోయి చితకబాదారని ప్రశ్నించారు. తమ పార్టీ పూర్తిగా ల్యాండ్ పూలింగ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అందుకు సంబంచిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశార. రైతులకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అండగా ఉంటారని తెలిపారు. థర్డ్ డిగ్రీ విషయంపై పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎస్ఐ, సీఐ పై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే వారిద్దరి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ధర్నా కోసం వస్తున్న బాధిత రైతులను దౌర్జన్యంగా పోలీసులు లాక్కెళ్లి స్టేషన్ కు తరలించడం దారుణమన్నారు. పోలీసు చేతిలో దెబ్బలు తిన్న రైతులను అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించడం సరికాదన్నారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ రైతులను ధర్నాకు రాకుండా పోలీసులు భయబ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. రేపు జరిగే పరిణామాలకు పోలీసులు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బాధ్యత వహించాలన్నారు. మాజీ మంత్రి విజయ రామారావు మాట్లాడుతూ తెలంగాణ వస్తే బూట్లు చప్పుడు, గన్ ఫైరింగ్ ఉండమని చెప్పిన సీఎం కేసీఆర్ పెరుమాండ్ల గూడెం రైతులపై పోలీసులు చేసిన దౌర్జన్యానికి సమాధానం చెప్పాలన్నారు. వరంగల్ లో ఇంత ఘోరం జరుగుతున్న హోంమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దుర్మార్గం , దారుమన్నారు. ల్యాండ్ పూలింగ్ లో భాగంగా 27 గ్రామాల్లో వేల ఎకరాలు ప్రభుత్వం వేల ఎకరాలు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నదని దీనిలో భాగంగా రైతులు మా భూములు మాకు కావాలని అడిగితే వారిపై పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దుర్మార్గమన్నారు. దీనిని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అరాచకం, అవినీతి ,అణిచివేతకు పర్యాయపదంగా మిగిలిపోయారన్నారు. వందల ఎకరాలు అక్రమంగా సంపాదించి ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూములను లాక్కోవాలని చూస్తున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్ అమలు మొట్టమొదట ఆరూరి రమేష్ భూమి నుంచి అమలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసన సందర్భంగా పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు సమయంలో పోలీసులకు బీజీపీ నాయకులకు తోపులాట జరిగింది. ధర్నాలో మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments