టీచర్ల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నన్నెబోయిన తిరుపతి
స్పాట్ వాయిస్, కమలాపూర్: ఉపాధ్యాయుల పదోన్నతుల బదిలీల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 వేల పైచిలుకు టీచర్ల కు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు నన్నెబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ గత ఏడేళ్లుగా టీచర్లకు ప్రమోషన్లు లేవని, పాఠశాలల్లో వేలాది పోస్టుల ఖాళీగా ఉన్నాయని వాపోయారు. ముఖ్యంగా ఎంఈవో, డీఈవో, హెచ్ఎం లాంటి పర్యవేక్షణ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అనేకమార్లు పదోన్నతులు కల్పిస్తామని ప్రకటన చేసిన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రుల మాటలు నీటి మూటలు అయ్యాయని వాపోయారు. 317 జీవో ద్వారా నష్టపోయిన భార్యాభర్తల ఒంటరి మహిళలు, ఇతర అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలని, కంట్రీ బ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించపోవతే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి ఆధ్వర్యంలో ఎస్సెస్సీ స్మార్ట్ మూల్యాంకనం నిర్వహిస్తున్న కాజీపేటలోని ఫాతిమా పాఠశాల ఎదుట సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించనున్నామని, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
టీచర్ల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలి
RELATED ARTICLES
Recent Comments