బాండ్ల ద్వారా రూ.4వేల కోట్ల అప్పు..
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి
స్పాట్ వాయిస్, డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి అప్పుల సేకరణలో ఉపశమనం కలిగింది. బాండ్ల ద్వారా రుణాలు తీసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 4 వేల కోట్లు సమీకరణకు తెలంగాణ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ నోటిఫికేషన్ ఇచ్చింది. 13 ఏళ్ల కాలానికి బాండ్లు జారీ చేయగా ఈనెల 7న బాండ్లను వేలం వేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బాండ్ల ద్వారా రూ.53వేల కోట్ల రుణం తీసుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించినా రెండేళ్లుగా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న బడ్జెటేతర రుణాల విషయంలో కేంద్రం అభ్యంతరం చెప్పింది. దీంతో ఇప్పటివరకు అప్పులు తీసుకునేందుకు అనుమతి లభించలేదు. అప్పుల ఆవశ్యకత పై తెలంగాణ సమర్పించిన వివరణను పరిగణలోకి తీసుకున్న కేంద్రం తాజాగా రూ.4వేల కోట్ల రుణ సమీకరణకు అనుమతి ఇచ్చింది.
Recent Comments