Sunday, April 20, 2025
Homeక్రైమ్పటిక, నాటుసారా పట్టివేత

పటిక, నాటుసారా పట్టివేత

స్పాట్ వాయిస్ నర్సంపేట (ఖానాపూర్ ): ఖానాపురం మండలంలోని నాజీతండాలో గురువారం సివిల్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన అజ్మీరా కీరు ఇంటిలో సోదలు నిర్వహించగా ఎనిమిది బస్తాల పటిక సుమారు 400కేజీలు, 5లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అజ్మీర కీరును అదుపులో కి తీసుకున్నారు. అతడిని విచారించగా అజ్మీరా బాలు అనే వ్యక్తి పటికను ఆయన ఇంట్లో నిల్వ చేసినట్లు తెలిపాడన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నాటు సారా క్రయ విక్రయాలు చేసినా, రవాణా చేసినా, నాటు సారా తయారీకి ఉపయోగించు బెల్లం, పటిక నిల్వ, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ దాడుల్లో ఎక్సజ్ సీఐ రాజసమ్మయ్య, ఎస్సై రాజేశ్వరి, రాధా కృష్ణ , ఖానాపూర్ ఎస్సై తిరుపతి సిబ్బంది సదానందం, లింగేశ్వర్, శ్రవణ్, స్వర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments