కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: ఐనవోలు మండలానికి చెందిన 59మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే అరూరి రమేష్ చెక్కులను పంపిణీ చేశారు. ఐనవోలు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు,తహసీల్దార్ రాజేష్,జెడ్పీ కో ఆప్షన్ మెంబరు ఉస్మాన్ అలీ,మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ మజ్జిగ జయపాల్,ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ మునిగాల సంపత్ కుమార్,మండల అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి,కార్యదర్శి రాజశేఖర్, అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్,మండల ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమం సీఎం లక్ష్యం
RELATED ARTICLES
Recent Comments