వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: హసన్ పర్తి మండలం సిద్దాపూర్ గ్రామ మాజీ అధ్యక్షుడు తాబేటి కళాధర్, బొల్ల మహేందర్ కుటుంబాలకు టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదివాకం ఆర్థిక సాయం అందజేశారు. గతంలో వారు మరణించిన సమయంలో వారి కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు తాబేటీ కళాధర్ , బొల్ల మహేందర్ పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతపాక సునీత, సర్పంచ్ జనగాం ధనలక్ష్మి కిరణ్, ఎంపీటీసీ హరికాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, గ్రామ అధ్యక్షుడు జనార్దన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా
RELATED ARTICLES
Recent Comments