స్వగ్రామానికి జవాన్ రాములు మృతదేహం
నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు
శోకసంద్రంలో మర్రిపల్లె
స్పాట్ వాయిస్, నర్సంపేట : పంజాబ్ లో విధులు నిర్వర్తిస్తున్న దుగ్గొండి మండలం మర్రిపల్లె గ్రామానికి చెందిన జవాన్ కన్నెబోయిన రాములు మృతదేహం ఆదివారం సాయంత్రం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు, నాయకులు జక్క అశోక్, తోటకూరి రాజు, ఇట్టబోయిన స్వామి, కామ శోభన్ బాబు, చింత యుగేందర్, సంకేసి కమలాకర్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు రాములు మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కాగా, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఎస్ ఎఫ్ అధికారులతో మాట్లాడి రాములు మృతదేహం స్వగ్రామానికి అంబులెన్స్ ద్వారా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని అధికారిక పనుల నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లిన ఎమ్మెల్యే ఇప్పటికే స్థానిక మండల నాయకత్వానికి పలు సూచనలు చేశారు. జవాన్ ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని, అంత్యక్రియలు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని కోరారు. రాములుకు ఏడేండ్ల కూతురు, ఐదేండ్ల కుమారుడు ఉన్నారు. జవాన్ రాములు ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మర్రిపల్లె శోకసంద్రంలో మునిగిపోయింది.
Recent Comments