Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఒక్క ఎస్సై పోస్టుకు 422 మంది పోటీ..

ఒక్క ఎస్సై పోస్టుకు 422 మంది పోటీ..

స్పాట్ వాయిస్, బ్యూరో: పోలీసు నియామకాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 17,516 పోస్టుల కోసం 7,33,559 మంది అభ్యర్థుల నుంచి 12,91,006 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) పేర్కొంది. 587 ఎస్సై పోస్టులకు 2,47,630 దరఖాస్తులు, 16,969 కానిస్టేబుల్‌ పోస్టులకు 9,54,064 దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే ఒక్కో ఎస్సై పోస్టుకు సగటున 422, కానిస్టేబుల్‌ పోస్టుకు 56 దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి ఎక్కువ దరఖాస్తులు రాగా.. ములుగు, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, నారాయణపేట, జనగామ, సిరిసిల్లల నుంచి అత్యల్పంగా నమోదయ్యాయి. మూడంచెల నియామక ప్రక్రియలో భాగంగా ప్రాథమిక రాతపరీక్షకు సంబంధించి ఆగస్టు 7న ఎస్సై అభ్యర్థులకు, 21న కానిస్టేబుల్‌ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే..తమ జిల్లాలోని పోస్టులు.. నమోదైన దరఖాస్తులను బట్టి పోటీ ఎలా ఉండబోతోందనే అంచనాల్లో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.

పోలీస్‌ యూనిట్ల వారీగా సివిల్‌, ఏఆర్‌ విభాగాల్లో పోస్టులు.. 
హైదరాబాద్‌ 1,918
సైబరాబాద్‌ 451,
రాచకొండ 850
వరంగల్‌ 666
రామగుండం 440
నిజామాబాద్‌ 640
కరీంనగర్‌ 413
సిద్దిపేట 212
ఖమ్మం 191
ఆసిఫాబాద్‌ 182
భూపాలపల్లి 66
ములుగు 68
ఆదిలాబాద్‌ 234
జగిత్యాల 123
నిర్మల్‌ 158
కామారెడ్డి 240
మెదక్‌ 179
సిరిసిల్ల 142
కొత్తగూడెం 102
మహబూబాబాద్‌ 170
నల్గొండ 464
సూర్యాపేట 320
సంగారెడ్డి 545
వికారాబాద్‌ 107
గద్వాల 118
మహబూబ్‌నగర్‌ 202
నాగర్‌కర్నూల్‌ 195
నారాయణపేట – 100
వనపర్తి – 131.

RELATED ARTICLES

Most Popular

Recent Comments