స్పాట్ వాయిస్, రామగుండ: రామగుండం ఎరువుల కర్మాగారానికి పొల్యూషన్ బోర్డు షాక్ ఇచ్చింది. తక్షణమే యూరియా ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ఎఫ్‌సీఎల్ నిబంధనలు పాటించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, కాలుష్య నివారణ నిబంధనలు పాటించలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. యూరియా, అమ్మోనియా, డస్ట్ లీకేజ్‌లపై ఫిర్యాదులు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై రామగుండం ఎమ్మెల్యే ఫిర్యాదుతో కాలుష్య మండలి తనిఖీలు చేపట్టింది. ఈ విషయమై తనిఖీలు చేసిన అధికారులు రూ.12 లక్షల గ్యారంటీ సొమ్మును జప్తు చేశారు.
Recent Comments