Saturday, September 21, 2024
Homeకెరీర్పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు నేటితో ఆఖరు

పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు నేటితో ఆఖరు

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: పోలీస్‌, ఎక్సైజ్‌, జైళ్లు, అగ్ని‌మా‌ప‌క‌ శా‌ఖల్లో పోస్టు‌ల దర‌ఖాస్తుకు నేటితో గడువు ముగియనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా యూనిఫాం సర్వీసుల్లోని అన్ని విభాగాల్లో కలిపి 17,516 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 20న దరఖాస్తు గడు‌వు ముగిసింది. అయితే అభ్యర్థుల కోరిక మేరకు ప్రభుత్వం రెండేండ్ల వయో‌ప‌రి‌మితి పెంచింది. ఈ నేప‌థ్యంలో దర‌ఖా‌స్తుకు ఈ నెల 26 వరకు గడువు పొడిగించారు. ఇప్పటివరకు 13 లక్షల దరఖాస్తులు వచ్చాయని, చివరి రోజుకావడంతో అభ్యర్థులు పెద్దసంఖ్యలో అప్లయ్‌ చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గురువారం రాత్రి 10 గంట‌ల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments