బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : టీఆర్ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఉద్యమ సమయంలో బీసీలు పెద్ద ఎత్తున పోరాటం చేసినా, వారికి సముచిత స్థానం కల్పించడంలో టీఆర్ఎస్ విఫలమైందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ ఆరోపించారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అలే భాస్కర్ మాట్లాడారు. దేశంలో బీసీలకు బీజేపీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. బీసీ నాయకుడైన నరేంద్ర మోడీని ప్రధానిని చేయడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో బీసీలకు చట్టసభల్లో గౌరవం కలిగించిందని కానీ, తెలంగాణలో టీఆర్ఎస్ బీసీలను అణచివేతకు గురిచేస్తోందన్నారు. రాష్ట్రంలో బీసీలనంతా ఐక్యం చేసి కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని గద్దె దించేలా ఉద్యమిస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు దివాకర్, సంజయ్ కుమార్, జిల్లా నాయకులు కంబాల రాజయ్య, బట్టి శ్రీశైలం, నరగోణి ఎల్లస్వామి గౌడ్, సూర మహిపాల్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం
RELATED ARTICLES
Recent Comments