మే31న పీఎం జమ చేయనున్న కేంద్రం
ఈ కేవైసీ ఇలా చేసుకోండి
స్పాట్ వాయిస్,బ్యూరో: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నగదును ఈనెల 31న రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులు పొందాలంటే లబ్ధిదారులందరూ ఈ కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. లేకపోత ఖాతాల్లో డబ్బులు జమకావని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2018 డిసెంబర్ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దాదాపు 11.5 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు.
ఈ కేవైసీ ఇలా…
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌పేజీ https://pmkisan.gov.in/ సందర్శించాలి. ఈ పేజీలో కుడి వైపున్న ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. సెర్చ్ నొక్కాలి. ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి. మొబైల్ కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది.
ఎలా తనిఖీ చేయాలి ?
* ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్ కు వెళ్లాలి.
* హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్ క్లిక్ చేయాలి.
* అనంతరం లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేసుకోవాలి
* రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్, బ్లాక్, గ్రామ సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
* చివరిగా గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది.
నమోదు ప్రక్రియ ఇలా
* పీఎం కిసాన్ యోజన పథకం ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు.
* ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్ కు వెళ్లి ఫార్మర్ కార్నర్ పై క్లిక్ చేయాలి. తర్వాత న్యూ ఫార్మర్
* కార్నర్ ఎంపిక చేసుకొని ఆధార్ నెంబర్, రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
* క్యాప్చర్ కోడ్ ను టైప్ చేయాలి.
* అనంతరం లబ్ధిదారుడి వివరాలను ఎంటర్ చేయాలి.
* బ్యాంకు అకౌంట్, వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని పొందుపర్చాలి
* సబ్మిట్ బటన్ ను నొక్కితే.. సరిపోతుంది.
* ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి.
Recent Comments